రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి

Father, son from Hyderabad die in accident in Yadadri-Bhongir. యాదగిరిగుట్ట రామాయంపేట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు

By Medi Samrat  Published on  13 March 2023 8:44 PM IST
రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి
యాదగిరిగుట్ట రామాయంపేట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌లోని చిల్కానగర్‌కు చెందిన పెద్ది రమేష్ (38), అతని కుమారుడు అభిషేక్ (14) ప్రయాణిస్తున్న టీవీఎస్ స్కూటీని రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందారు. తండ్రీకొడుకులు వరంగల్‌లోని వర్ధన్నపేట నల్లబెల్లి గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యాదగిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story