రెస్టారెంట్ లో మంటలు.. ఆర్పడానికి వెళ్లి తండ్రీ కొడుకులు మృతి

బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలోని ఓ రెస్టారెంట్‌లో సోమవారం ఉదయం రెండు ఎల్‌పీజీ సిలిండర్లు పేలడంతో ఓ వ్యక్తి, అతని కుమారుడు మృతి చెందారు.

By Medi Samrat  Published on  25 Nov 2024 11:15 AM GMT
రెస్టారెంట్ లో మంటలు.. ఆర్పడానికి వెళ్లి తండ్రీ కొడుకులు మృతి

బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలోని ఓ రెస్టారెంట్‌లో సోమవారం ఉదయం రెండు ఎల్‌పీజీ సిలిండర్లు పేలడంతో ఓ వ్యక్తి, అతని కుమారుడు మృతి చెందారు. రెస్టారెంట్‌లో మంటలు ఆర్పేందుకు తండ్రీకొడుకులు వెళ్లిన సమయంలో సిలిండర్లు పేలాయి. సోమవారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో జోగ్‌సర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖర్మంచక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

కిషన్ కుమార్ జున్‌జున్‌వాలా, అతని కుమారుడు ప్రసూన్ జున్‌జున్‌వాలా అలియాస్ కన్హయ్య తీవ్రంగా గాయపడ్డంతో వారిని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో మంటలు వేగంగా ఎగసిపడ్డాయి. దీంతో భవనం నుంచి పొగలు రావడం వీడియోలో ఉంది. స్థానిక యువకులు సహాయం అందించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు, అయితే మంటలు చాలా త్వరగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని, దీంతో వెంటనే భారీగా మంటలు చెలరేగాయని జిల్లా అధికారులు అనుమానిస్తున్నారు.

తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో చాలా మంది నివాసితులు తమ మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు పంపాం. తదుపరి విచారణ కొనసాగుతోందని జోగ్‌సర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

Next Story