ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. బోనకల్ మండలంలో తండ్రి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోగా, అతడిని రక్షించే ప్రయత్నంలో కుమారుడు కూడా మృతి చెందాడు. బోనకల్ మండలం పరిధిలోని ఆలపాడు గ్రామంలో జరిగింది. ఆలపాడు గ్రామానికి చెందిన పఠాన్ యూసుఫ్ ఖాన్ గ్రామంలోని చెరువులోకి దిగగా, ప్రమాదవశాత్తూ పట్టు కోల్పోయి నీటిలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన కుమారుడు కరీముల్లా తన తండ్రిని కాపాడేందుకు చెరువులోకి దిగాడు. దురదృష్టవశాత్తు, తండ్రితో పాటు కుమారుడు కూడా నీట మునిగి మరణించాడు. రంజాన్ పండుగ రోజునే ఈ విషాదం చోటు చేసుకుంది.