విషాదం.. 15 నిమిషాల వ్య‌వ‌ధిలో తండ్రి, కూతురు మృతి

15 నిమిషాల తేడాతో తండ్రి, కూతురు మృతి చెందిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వ‌చ్చింది.

By Medi Samrat  Published on  25 May 2024 8:00 AM IST
విషాదం.. 15 నిమిషాల వ్య‌వ‌ధిలో తండ్రి, కూతురు మృతి

15 నిమిషాల తేడాతో తండ్రి, కూతురు మృతి చెందిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వ‌చ్చింది. నిజామాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందగా.. ఆమె కోసం ఆహారం తీసుకువస్తుండగా తండ్రి ప్రమాదంలో మృతి చెందాడు. రెంజల్ మండలం వీరన్నపేట్ గ్రామానికి చెందిన మాలోత్ జ్యోతి(35)కి అబ్బాపూర్ తండాకు చెందిన ప్రకాష్‌తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అయితే ప్రకాష్ వివాహేతర సంబంధం పెట్టుకుని నాలుగేళ్ల క్రితం మరో మహిళను పెళ్లి చేసుకుని మొదటి భార్య, కూతుళ్లను పట్టించుకోకుండా జ్యోతిని వేధించేవాడు. దీంతో మే 21వ తేదీ సాయంత్రం జ్యోతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను నిజామాబాద్ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం రాత్రి ఆమె తండ్రి లక్ష్మణ్‌ రాథోడ్‌(60) ద్విచక్ర వాహనంపై ఆహారం తీసుకురావడానికి వెళ్లి కళ్యాపూర్‌ సమీపంలో ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి మ‌ర‌ణానికి 15 నిమిషాల ముందు జ్యోతి కూడా చనిపోయిందని తేలింది. కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో మృతుల బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Next Story