రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌పై వెళ్తున్న తండ్రీకూతురు ఓ ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన మచ్చేందర్ (48), కూతురు మైత్రి (20) వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోంది. అయితే, వర్షం పడుతుండటంతో కూతురుని బస్టాప్ వద్ద దింపేందుకు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రోడ్డు క్రాస్ చేస్తుండా వారి బైక్‌ను ఓ ట్యాంకర్ అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మచ్చేందర్, మైత్రికి తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.