దారుణం.. బాలికపై ఐదేళ్లుగా తండ్రి, అన్న అత్యాచారం.. తాత, మామ లైంగిక వేధింపులు
Father and brother molested minor girl for over 5 years.దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఎన్ని కఠిన చట్టాలు
By తోట వంశీ కుమార్ Published on 20 March 2022 10:55 AM ISTదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై దాడులు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయిన కామాంధులు.. వావి వరుస సైతం మరిచి దారుణాలకు తెగబడుతున్నారు. చిన్న వయస్సులోనే పసిమొగ్గలు వీరి వాంఛలకు బలి అవుతున్నారు. సొంత వారే వేదింపులకు గురి చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపలే కులిపోతున్నారు. పాఠశాలలో నిర్వహించిన గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ కార్యక్రమంలో ఓ చిన్నారి బాలిక వెల్లడించిన విషయాలు అందరిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. గత ఐదేళ్లుగా సొంత తండ్రి, అన్న బాలికపై వేర్వేరు సమయాల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఆ బాలిక తాత, మామ సైతం చిన్నారిని లైంగికంగా వేదించారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పుణె నగరంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాధిత బాలిక(11) కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చి పూణెలో ఉంటున్నారు. బాలిక స్థానిక పాఠశాలో చదువుకుంటుంది. కాగా.. చిన్నారుల్లో అవగాహన కలిగించేందుకు ఇటీవల పాఠశాలలో గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని బయటపెట్టింది. 2017 నుంచి చిన్నారి తండ్రి బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు చెప్పింది. ఇక 2020 నుంచి బాలిక సోదరుడు కూడా ఈ నీచానికి ఒడిగట్టాడు. అలాగే.. బాలిక తాత, వరుసకు మామ అయిన వ్యక్తి సైతం లైంగిక వేదింపులకు గురి చేశారు. అయితే.. ఇది సామూహిక అత్యాచారం కాదని.. వేర్వేరు సమయాల్లో వీరంతా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పుణెలోని బుంద్ గార్డెన్ స్టేషన్‌లో బాలిక తండ్రి, సోదరుడు, తాత, మామలపై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేశారు.