బుధవారం హర్యానాలోని రోహ్‌తక్‌లోని బోహార్ గ్రామంలో రైతు, అతని మైనర్ కుమార్తెను గుర్తు తెలియని దుండగులు వారి ఇంట్లో కాల్చి చంపారు. మృతులను సురేందర్ సింగ్ (50), అతని కుమార్తె నికిత (13)గా గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న సురేందర్ సింగ్ తల్లి ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. సురేందర్ సింగ్ కు తన భార్యతో వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కోర్టులో కేసు నడుస్తున్నట్లు కూడా స్థానికులు తెలిపారు.
నివేదికల ప్రకారం.. సురేందర్ సింగ్ తన పనుల్లో ఉండగా.. ఉదయం 6:00 గంటలకు మోటర్‌బైక్‌పై దుండగులు అతని ఇంటికి చేరుకున్నారు. అతడిని మూడుసార్లు కాల్చగా.. అక్కడికక్కడే అతడు మరణించాడు. ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తులు గాఢ నిద్రలో ఉన్న నికితపై కాల్పులు జరిపారు.
సురేందర్ తల్లి వినికిడి లోపం కారణంగానే దాడి నుంచి బయటపడి ఉంటుందని భావిస్తున్నారు. సురేందర్ ఇరుగుపొరుగు వారు సంఘటనా స్థలానికి చేరుకోగా, దుండగులు అప్పటికే పారిపోయారు. ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలిని సందర్శించి ఆధారాలు సేకరించింది. హత్యా నేరం కింద, ఆయుధ చట్టంలోని నిబంధనల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ హత్యల వెనుక ఖచ్చితమైన ఉద్దేశ్యం ఇంకా తెలియలేదు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.