అతడి పోలీసు యూనిఫామ్‌పై డౌట్ వచ్చింది.. ఆ అనుమాన‌మే నిజం అయ్యింది..!

50 ఏళ్ల వ్యక్తి పోలీసు యూనిఫాంపై అనుమానం రావడంతో ఆదివారం నాడు ఉత్తరప్రదేశ్ లోని ఎటా జిల్లాలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  17 Feb 2025 9:30 PM IST
అతడి పోలీసు యూనిఫామ్‌పై డౌట్ వచ్చింది.. ఆ అనుమాన‌మే నిజం అయ్యింది..!

50 ఏళ్ల వ్యక్తి పోలీసు యూనిఫాంపై అనుమానం రావడంతో ఆదివారం నాడు ఉత్తరప్రదేశ్ లోని ఎటా జిల్లాలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. లలిత్‌పూర్ జిల్లాకు చెందిన హేమంత్ బుందేలా తన భార్య స్నేహితురాలికి, ఆమె భర్తకు మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఎటాహ్‌లోని ఝెల్సర్‌కు వచ్చాడు.

ఎస్‌హెచ్‌ఓ ఝలేసర్ సుధీర్ కుమార్ సాధారణ ప్యాట్రోలింగ్‌లో ఉండగా కారులో కూర్చున్న ఓ వ్యక్తి కనిపించాడు. అతడు హేమంత్ బుందేలా. ఎస్పీ స్థాయి పోలీసు యూనిఫాం ధరించి ఉండడాన్ని గమనించారు. నిశితంగా పరిశీలించిన తర్వాత, బుందేలా టోపీ వేరుగా ఉండడం, ఆయన ర్యాంక్‌కు అనుగుణంగా లేకపోవడం సుధీర్ కుమార్ కనుగొన్నాడు. వెంటనే జలేసర్ సర్కిల్ అధికారి నితీష్ గార్గ్‌కు సమాచారం అందించాడు. ఇద్దరు అధికారులు బుందేలాను ప్రశ్నించినప్పుడు, అతను తన నేరాన్ని అంగీకరించాడు. తన భార్య స్నేహితుని అత్తమామలపై ఒత్తిడి తెచ్చేందుకు IPS అధికారి లాగా నటించానని చెప్పుకున్నాడు. బుందేలాపై BNS సెక్షన్ 204 కింద కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు.

Next Story