హైదరాబాద్: రంగురాళ్ల బిజినెస్ ముసుగులో హవాలా దందా చేస్తున్న గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రాలజిస్ట్ గా చెప్పుకుంటున్న మురళీకృష్ణ ఇంట్లో ఈనెల 15 వ తేదీన దొంగతనం జరిగింది. రూ.40 లక్షల విలువచేసే జాతిరత్నాలు చోరికి గురయ్యాయని మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో రంగురాళ్ల ముసుగులో నకిలీ కరెన్సీ దందా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇక మురళీకృష్ణ ఇంట్లో దొంగతనం చేసిన దొంగలను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది.
దొంగల నుంచి రూ.17 కోట్లు విలువైన నకిలీ కరెన్సీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీతో పాటు రూ. 6 లక్షల 32 వేల నగదు, 10 సెల్‌ఫోన్లు, కారు సీజ్ చేశారు. మురళీకృష్ణ డబ్బు విషయం దాచి రంగురాళ్లు పోయాయని ఫిర్యాదు చేశాడు. మురళీకృష్ణతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలావుంటే.. రూ. 90 కోట్ల హవాలా మనీ కేసులో గతంలో మురళీకృష్ణ జైలుకు వెళ్లొచ్చాడని చెబుతున్నారు.