కర్ణాటకలోని మైసూరులో శుక్రవారం నాడు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) మాజీ అధికారి కారు ఢీకొనడంతో మృతి చెందాడు. పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు భావిస్తూ ఉన్నారు. మైసూరు విశ్వవిద్యాలయంలోని మానసగంగోత్రి క్యాంపస్‌లో శుక్రవారం సాయంత్రం ఆర్‌కె కులకర్ణి వాకింగ్ చేస్తుండగా కారు ఆయనను ఢీకొట్టిందని, వాహనానికి నంబర్ ప్లేట్ లేదని అధికారులు తెలిపారు. పోలీసులు మొదట ఇది హిట్ అండ్ కేస్ అని భావించారు, కానీ CCTV ఫుటేజీని స్కాన్ చేసిన తర్వాత ప్రమాదం ఉద్దేశపూర్వక చర్యగా అనిపిస్తోందని అధికారులు తెలిపారు. వీడియో క్లిప్ లో ఎప్పటిలాగే నడుచుకుంటూ వెళుతున్న.. 82 ఏళ్ల వ్యక్తి వైపు వేగంగా కారు వచ్చింది చూపిస్తుంది. కారుతో అతడిని ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
విచారణలో ఇది ప్రమాదం కాదు, ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని మేము నిర్ధారణకు వచ్చామని మైసూరు పోలీసు కమిషనర్ చంద్రగుప్త చెప్పారు. ఆ లైన్ లో కారు లాంటి వాహనాలు తక్కువగా ప్రయాణిస్తూ ఉంటాయని.. నిందితులు కులకర్ణిని ఫాలో చేస్తున్నట్లు తెలుస్తోందని ఒక అధికారి తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశామని, హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. కులకర్ణి మూడు దశాబ్దాలకు పైగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసి 23 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేశారు.