పార్కింగ్ విషయంలో గొడవ.. ఇటుకతో తలపై బాదడంతో..

Ex-Delhi Police Officer's Son Dies After Head Smashed With Brick In Fight Over Parking. ఘజియాబాద్‌లో రోడ్డు పక్కన ఉన్న హోటల్ బయట పార్కింగ్ విషయంలో తీవ్ర వాగ్వివాదం

By Medi Samrat  Published on  26 Oct 2022 8:15 PM IST
పార్కింగ్ విషయంలో గొడవ.. ఇటుకతో తలపై బాదడంతో..

ఘజియాబాద్‌లో రోడ్డు పక్కన ఉన్న హోటల్ బయట పార్కింగ్ విషయంలో తీవ్ర వాగ్వివాదం జరగడంతో 35 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడి తలపై ఇటుకతో బాదడంతో అతడు చనిపోయాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో రికార్డ్ చేశారు. దీంతో ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తి బాధితుడి తలను ఇటుకతో పగులగొట్టినట్లు వీడియోలో ఉంది. బాధితుడు ఆ దెబ్బ తగిలిన తర్వాత కదలకుండా నేలపై పడి ఉన్నాడు. 35 ఏళ్ల వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలో అతను మరణించాడని తెలుస్తోంది. ఐదు బృందాలు నిందితుల కోసం వెతుకుతున్నాయని ఘజియాబాద్ పోలీసులు ట్విట్టర్ లో తెలిపారు.

"అక్టోబరు 25న లోని హాబ్స్ కిచెన్ ముందు రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మరొక వర్గానికి చెందిన వ్యక్తిని ఇటుకతో కొట్టారు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఈ కేసుపై ఐదు బృందాలు పనిచేస్తున్నాయి. నిందితులను విచారణ అనంతరం జైలుకు పంపాం'' అని నగర అదనపు ఎస్పీ జీకే సింగ్‌ తెలిపారు. గత కొన్ని వారాలుగా, నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు సాధారణమైపోయాయి.


Next Story