బెజ‌వాడ‌లో డ్యాన్స‌ర్ అనుమానాస్ప‌ద మృతి

Event Dancer Suspicious Death In Vijayawada. బెజవాడ వాంబే కాలనీలో ఈ వెంట్ డ్యాన్స‌ర్ అనుమానాస్ప‌ద స్థితిలో

By Medi Samrat  Published on  19 Dec 2020 12:21 PM GMT
బెజ‌వాడ‌లో డ్యాన్స‌ర్ అనుమానాస్ప‌ద మృతి

బెజవాడ వాంబే కాలనీలో ఈ వెంట్ డ్యాన్స‌ర్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. డాన్సర్ గా పని చేస్తున్న గాయత్రి ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ‌ ఆమె ఆత్మహత్యకు ముందు నీలిమా అనే యువతి ఇంటి కొచ్చినట్లు సమాచారం. ఇద్దరి మధ్య ఇంట్లో వివాదం జరిగినట్లు తెలిసింది.నీలిమ వెళ్లిన త‌రువాత గాయ‌త్రి ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అదే స‌మ‌యంలో గాయ‌త్రి భ‌ర్త స‌తీశ్ పిల్ల‌ల‌తో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లాడు. గాయ‌త్రి మృతిపై ఆమె కుటుంబ స‌భ్యులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. గాయ‌త్రితో గొడ‌వ ప‌డ్డ నీలిమ ప‌రారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చేప‌ట్టారు.


Next Story
Share it