Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్ధి మృతి

హైద‌రాబాద్‌ గండిపేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

By Medi Samrat
Published on : 11 March 2025 5:29 PM IST

Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్  విద్యార్ధి మృతి

హైద‌రాబాద్‌ గండిపేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కార‌ణంగా పోలీసులు పేర్కొన్నారు. వివేక్ రెడ్డి, హేం సాయి, శ్రీకర్, సృజన్, కార్తికేయ, హర్షవర్ధన్ అనే యువకులు గండిపేట్ పరిసర ప్రాంతంలో ఉన్న సిబిఐటీ ఇంజనీ రింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈ ఆరుగురు విద్యార్థులు కారులో బయలు దేరారు. వేగంగా వెళ్తున్న క్ర‌మంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి నార్సింగి మూవీ టవర్ వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ గండిపేట కళాశాల నుండి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స‌మాచారం అంద‌డంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. కారు డ్యామేజ్ అయిన తీరును చూసి.. విద్యార్థులు మితిమీరిన వేగంతో ఉన్నార‌ని.. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్ర‌మాదంపై మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story