ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

Engineering student ends life in Medchal. కాలేజీ హాస్టల్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది.

By Medi Samrat
Published on : 10 April 2022 5:19 PM IST

ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

కాలేజీ హాస్టల్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ బాలికల హాస్టల్‌లో చోటుచేసుకుంది. ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ విద్యార్థిని స్వాతిక (19)గా గుర్తించారు. స్వాతిక తన గదిలోని సీలింగ్‌కు ఉరి వేసుకుని విగ‌త‌జీవిగా కనిపించింది. దీంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప‌రిశీలించారు.

పోలీసులు స్వాతిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, పోలీసులు స్వాతిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తుది నిర్ణయానికి రావడానికి పోలీసులు ఇతర కోణాలను కూడా పరిశీలిస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నివేదికను పోలీసులు కోరారు.










Next Story