Hyderabad : రోడ్డుపై కూలిన భారీ వృక్షం.. వృద్ధుడు మృతి

సోమవారం మధ్యాహ్నం పాతబస్తీలోని షంషీర్‌గంజ్‌లో రోడ్డుపై చెట్టు కూలడంతో ఓ వృద్ధుడు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు

By Medi Samrat
Published on : 22 July 2024 8:48 PM IST

Hyderabad : రోడ్డుపై కూలిన భారీ వృక్షం.. వృద్ధుడు మృతి

సోమవారం మధ్యాహ్నం పాతబస్తీలోని షంషీర్‌గంజ్‌లో రోడ్డుపై చెట్టు కూలడంతో ఓ వృద్ధుడు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందూలాల్ బరాదారీకి చెందిన మహ్మద్ సలేహ్ (65) షమ్‌షీర్‌గంజ్ రోడ్డులో స్కూటర్‌పై వెళ్తుండగా రెండు దశాబ్దాల నాటి చెట్టు ఒక్కసారిగా విరిగి పడింది. సోమవారం మధ్యాహ్నం రద్దీగా ఉండే రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో మొత్తం 12 మందికి గాయ‌ప‌డ్డారని తెలుస్తోంది. ప‌లు వాహ‌నాలు ధ్వంస‌మైయ్యాయని పోలీసులు తెలిపారు. క్షత‌గాత్రుల ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు చెట్టును తొల‌గించి ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు. “సలేహ్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా పెద్ద చెట్టు అతనిపై పడింది. అతనికి గాయాలు తగిలి చెట్టుకింద చిక్కుకుపోయాడు. స్థానిక ప్రజలు, పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అతను మరణించాడు, ”అని షాహలిబండ పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు.

Next Story