దుర్గమ్మనే నా బిడ్డలను చంపమని చెప్పింది.. కన్నతల్లి దారుణం..

'Durga Maa says kill both children', says Kalyugi Maa after killing innocents. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బరేలీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూటా పోలీస్ స్టేషన్ పరిధిలోని

By Medi Samrat  Published on  14 Nov 2021 6:59 PM IST
దుర్గమ్మనే నా బిడ్డలను చంపమని చెప్పింది.. కన్నతల్లి దారుణం..

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బరేలీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూటా పోలీస్ స్టేషన్ పరిధిలోని మట్కాపూర్ గ్రామంలో ఓ మహిళ తన 6 నెలల కూతురు, రెండేళ్ల కుమారుడిని గొంతు నులిమి హత్య చేసింది. ఉదయం భర్త ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న బిడ్డలను చూసి భయకంపితులు అయ్యారు. ఆ విషయాన్ని భార్యతో అడగ్గా కలలో దుర్గమాత వచ్చి పిల్లలిద్దరినీ చంపేయమని చెప్పింది. అందుకే ఉదయం ఇద్దరినీ గొంతు నులిమి చంపాను అని తెలిపింది.

గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. ఆ తర్వాత భర్త నిద్రించేందుకు సమీపంలోని తన తండ్రి ఇంటికి వెళ్లాడు. ఉదయం అల్పాహారానికి వచ్చి చూడగా చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసింది. సమాచారం అందుకున్న ఎస్‌ఎస్పీ రోహిత్‌సింగ్ సజ్వాన్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళపై హత్య కేసు నమోదు చేశారు.

ఈ దారుణానికి పాల్పడిన మహిళను జయంతిగా గుర్తించారు. ఆమె భర్త బేతు గాంగ్వార్ మద్యానికి బానిసైనట్లు సమాచారం. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి కూడా బేతు తాగి వచ్చి జయంతితో గొడవపడ్డాడు. గొడవ తీవ్రరూపం దాల్చడంతో బేతు తన తండ్రి ఇంట్లో నిద్ర పోడానికి వెళ్ళాడు. ఉదయం వచ్చి చూడగా.. తన ఇద్దరు బిడ్డలు కూడా మరణించి ఉన్నారు. జయంతి మానసిక పరిస్థితి సరిగా లేదని చెబుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై మరింత లోతుగా విచారిస్తూ ఉన్నారు.


Next Story