రైల్వే టీసీ (ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్) రైల్లో అర్థరాత్రి మద్యం మత్తులో ఓ మహిళ తలపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్ ఏ1 కోచ్ లో ప్రయాణిస్తున్న బాధితురాలు తన భర్త రాజేష్ కుమార్ తో అమృత్ సర్ నుంచి కోల్ కతా వెళ్తుంది. అర్థరాత్రి రైల్వే టీసీ మున్నా కుమార్ మద్యం మత్తులో బాధితురాలి తలపై మూత్ర విసర్జన చేశాడు. దాంతో ఆగ్రహించిన సదరు మహిళ టీసీతో గొడవకు దిగింది. గొడవ వల్ల మెళకువ వచ్చిన మిగతా ప్రయాణికులు టీసీని పట్టుకొని చితక బాదారు. ఛార్ భాగ్ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందుతుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. నిందితుడిని బీహార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
నిందితుడిని బీహార్‌కు చెందిన మున్నా కుమార్‌గా గుర్తించారు, ఇతను అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్‌లో అమృత్‌సర్- కోల్‌కతా మధ్య విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. నివేదికల ప్రకారం, మహిళ నిద్రిస్తున్న సమయంలో టీటీఈ మూత్ర విసర్జన చేశాడు. టీటీఈని జీఆర్పీ బృందం అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌సర్‌లో నివాసం ఉంటున్న ప్రయాణికుడు రాజేష్, అతని భార్య మేరకు ఈ చర్య తీసుకున్నట్లు GRP చార్‌బాగ్ రైల్వే స్టేషన్ ఇన్‌ఛార్జ్ నవరత్న గౌతమ్ తెలిపారు.
కొన్ని నెలల క్రితం ఓ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన పక్కనే కూర్చున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. నిందితుడిని అమెరికాలో పనిచేస్తున్న భారతీయుడు శంకర్ మిశ్రాగా గుర్తించారు. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించకుండా 4 నెలల నిషేధం విధించారు.