Bengaluru: రైల్వే స్టేషన్‌లో డ్రమ్ములో మహిళ మృతదేహం.. 3 నెలల్లో మూడో ఘటన

బెంగళూరు జిల్లా బైయప్పనహళ్లిలోని ఎస్‌ఎంవీటీ వద్ద మంగళవారం ప్లాస్టిక్ డ్రమ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.

By అంజి  Published on  14 March 2023 7:30 AM GMT
railway station, Bengaluru

రైల్వే స్టేషన్‌లో డ్రమ్ములో మహిళ మృతదేహం.. 3 నెలల్లో మూడో ఘటన 

కర్నాటకలో దారుణ ఘటన వెలుగు చూసింది. బెంగళూరు జిల్లా బైయప్పనహళ్లిలోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్‌ఎంవీటీ) వద్ద మంగళవారం ప్లాస్టిక్ డ్రమ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చనిపోయిన మహిళ వయస్సు 31-35 సంవత్సరాలు. మృతి చెందిన మహిళ వయస్సు 32-35 ఏళ్ల మధ్య ఉంటుందని కర్ణాటకలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రైల్వేస్) ఎస్కే సౌమ్యలత తెలిపారు. ఆమెను ఇంకా గుర్తించాల్సి ఉంది. హత్య కేసు నమోదు చేశారు.

మృతదేహాన్ని ఆటో రిక్షాలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు డ్రమ్‌ను తీసుకెళ్లి రైల్వే స్టేషన్‌లో వదిలి వెళ్లిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని రైల్వే ఎస్పీ సౌమ్యలత సందర్శించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి డ్రమ్‌ను తీసుకెళ్లిన వ్యక్తుల ఆచూకీ కోసం పోలీసులు విచారణ ప్రారంభించారు. జనవరిలో జరిగిన ఇలాంటి ఘటనలో 31-35 ఏళ్ల మధ్య వయసున్న మహిళ మృతదేహం బెంగళూరులోని యశవంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో లభ్యమైంది .

జనవరి 4వ తేదీన యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 చివరిలో పాడుబడిన నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో కుళ్ళిపోయిన యువతి మృతదేహాన్ని రైల్వే పోలీసులు చూశారు. మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం నుంచి తీసుకొచ్చి రైల్వే స్టేషన్‌లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు డిసెంబర్ రెండవ వారంలో ఎస్‌ఎమ్‌వీటీ స్టేషన్‌లోని ప్యాసింజర్ రైలు కోచ్‌లో గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనుగొనబడింది. ఇతర సామానుతో పాటు పడవేయబడిన గోనె సంచి నుండి దుర్వాసన వస్తోందని ఒక ప్రయాణీకుడు ఫిర్యాదు చేయడంతో బాగా కుళ్లిపోయిన అవశేషాలు కనుగొనబడ్డాయి.

Next Story