భార్య లేని సమయంలో.. మద్యం మత్తులో 10 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం

Drunk man sexual assault 10-year-old daughter in wife’s absence. తమిళనాడులో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో కన్న కూతురిపైనే దారుణానికి ఓడిగట్టాడో తండ్రి.

By అంజి  Published on  25 Dec 2021 1:50 PM IST
భార్య లేని సమయంలో.. మద్యం మత్తులో 10 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం

తమిళనాడులో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో కన్న కూతురిపైనే దారుణానికి ఓడిగట్టాడో తండ్రి. అభం శుభం తెలియని బాలికపై కామంతో కళ్లుమూసుకుపోయిన తండ్రి.. తన కన్న కూతురు అని చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 37 ఏళ్ల వ్యక్తి తన భార్య లేని సమయంలో తన 10 ఏళ్ల కుమార్తెపై తన ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు మద్యం మత్తులో కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిసింది. ఓ జాతీయ దినపత్రిక ప్రచురించిన కథనం మేరకు.. 5వ తరగతి చదువుతున్న బాధితురాలు, పని నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన తల్లికి తన భయంకరమైన బాధను వివరించింది.

ఆ తర్వాత తన భర్తకు వ్యతిరేకంగా మహిళ ఫిర్యాదు చేయడానికి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కాగా నిందితుడిపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు సోమవారం రాత్రి నిందితులపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోస్కో) చట్టం, 2012లోని సెక్షన్ 7 (లైంగిక వేధింపులు), సెక్షన్ 8 (లైంగిక వేధింపులకు శిక్ష) కింద ఫిర్యాదు నమోదు చేశారు. నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి ప్రత్యేక పోక్సో కోర్టులో హాజరుపరిచారు, అనంతరం అతన్ని పల్లడం సబ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

Next Story