మద్యం మత్తులో.. భార్య, 5 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన భర్త
Drunk man kills wife, minor daughter after fight over money. హర్యానా రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. ఖేర్కి దౌలా ప్రాంతంలోని భంగ్రోలా గ్రామంలో శనివారం మద్యం కొనడానికి డబ్బు
By అంజి Published on 7 Feb 2022 2:29 PM ISTహర్యానా రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. ఖేర్కి దౌలా ప్రాంతంలోని భంగ్రోలా గ్రామంలో శనివారం మద్యం కొనడానికి డబ్బు నిరాకరించినందుకు ఒక వ్యక్తి తన భార్య, 5 ఏళ్ల కుమార్తెను హత్య చేశాడు. దీపక్ అనే నిందితుడు మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మద్యం మత్తులో భార్య, కుమార్తెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రిపోర్ట్ ప్రకారం.. సంఘటన జరిగిన రోజు రాత్రి, నిందితుడు తాగిన స్థితిలో ఇంటికి వచ్చాడు. మద్యం కొనుగోలు కోసం అతని భార్య రజనీష్ నుండి మరింత డబ్బు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
అయితే, డబ్బు నిరాకరించడంతో, కోపంతో నిందితుడు అతని భార్య, కుమార్తెను బరువైన వస్తువుతో కొట్టి అక్కడి నుండి పారిపోయాడని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) ప్రీత్ పాల్ సాంగ్వాన్ తెలిపారు. బాధితురాలి సోదరుడు సంఘటన గురించి తెల్లవారుజామన సమాచారం అందుకున్నాడు. ఆ తర్వాత అతను సంఘటనా స్థలానికి చేరుకుని తన సోదరి, మేనకోడలు ఇద్దరినీ సివిల్ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ అతని సోదరి చనిపోయినట్లు ప్రకటించబడింది. అయితే, ఇంకా ప్రాణాలతో పోరాడుతున్న అతని మేనకోడలు చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అయితే ఆ తర్వాత ఆమె కూడా తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచింది.
బాధితురాలి సోదరుడు ఫిర్యాదు చేశాడు
ఈ సంఘటన తర్వాత, బాధితురాలి సోదరుడు తన సోదరిని పదే పదే హింసిస్తున్నాడని ఆరోపిస్తూ తన బావపై ఫిర్యాదు చేసేందుకు ఖేర్కీ దౌలా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. బాధితురాలి సోదరుడు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, దీపక్‌పై ఐపిసి సెక్షన్లు 302 (హత్య), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. విచారణ ప్రారంభించింది. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని, నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.