ముంబయి : ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 5 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్‌ను క్రైం బ్రాంచ్ బృందం స్వాధీనం చేసుకుంది. మహిళతో సహా ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు. కేటుగాళ్లు ఏకంగా చిన్నారుల వాటర్ బాటిల్ లో దాచి డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేస్తూ వచ్చారు.
ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 3 మాన్‌ఖుర్డ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లను అరెస్టు చేసింది. వీరి నుండి 1 కిలో 935 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 5 కోట్ల 80 లక్షల రూపాయలు. క్రైమ్ బ్రాంచ్ నిందితులను అరెస్టు చేసి వారిపై ఎన్‌డిపిఎస్ చట్టం కింద విచారణ ప్రారంభించింది. పిల్లల వాటర్ బాటిళ్లలో దాచి హెరాయిన్ డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే క్రైమ్ బ్రాంచ్ వారిద్దరినీ అరెస్ట్ చేసింది.
అరెస్టయిన మహిళ చాలా కాలంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. గత ఆరు నెలలుగా ఆమె కోసం వెతుకుతున్నాడు. క్రైమ్ బ్రాంచ్ ఆ మహిళను అరెస్టు చేయగా, వాటర్ బాటిల్ పక్కన స్కూల్ బ్యాగ్ కూడా కనిపించింది. క్రైం బ్రాంచ్ వాటర్ బాటిల్‌స్ ను తెరిచి చూడగా అందులో 1 కిలో 935 గ్రాముల హెరాయిన్ లభ్యమైంది.