డబుల్ మర్డర్.. భార్యాభర్తల దారుణ హ‌త్య‌

Double murder in UP’s Meerut, couple found dead with throats slit. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో డబుల్ మర్డర్‌ జరిగింది. భార్యాభర్తలను అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

By Medi Samrat
Published on : 16 May 2023 6:15 PM IST

డబుల్ మర్డర్.. భార్యాభర్తల దారుణ హ‌త్య‌

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో డబుల్ మర్డర్‌ జరిగింది. భార్యాభర్తలను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. శాస్త్రి నగర్ కాలనీలోని మంగళవారం ఉదయం భార్యాభర్తలు విగతజీవుల్లా కనిపించారు. దుండగులు వారి గొంతు కోసి చంపేశారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు. ఘజియాబాద్‌లోని ఐరన్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రమోద్‌ కరణ్‌వాల్‌ (50), మీరట్‌లోని ఓ ప్రైవేట్‌ కాన్వెంట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న అతని భార్య మమత (45) సెక్టార్‌ 6లోని తమ ఇంటి మొదటి అంతస్తులో శవాలై కనిపించారు. అతని తల్లిదండ్రులు కింది అంతస్తులో నివసిస్తున్నారు. వారు అపస్మారక స్థితిలో కనిపించారు.

వారి కుమారుడు ఆర్యన్ (24) మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో తల్లిదండ్రులు, తాతకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఇరుగుపొరుగు వ్యక్తులు కలిసి ఇంటిని తనిఖీ చేయడానికి వెళ్లారు. పొరుగింట్లో ఉండే శివం ఇంటికి చేరుకుని మెయిన్ గేటు తెరిచి చూడగా ప్రమోద్ తల్లిదండ్రులు నరేంద్ర ప్రతాప్ (76), వినోద్ బాలా (68) గ్రౌండ్ ఫ్లోర్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. అతను మొదటి అంతస్తుకు వెళ్లి మంచం మీద పడి భార్యాభర్తల మృతదేహాలను గుర్తించాడు. వెంటనే పోలీసులుకు సమాచారం అందించాడు. గుర్గావ్‌లో పని చేస్తున్న ఆర్యన్, అతని సోదరికి సమాచారం ఇచ్చాడు. “మృతదేహాలను శవపరీక్ష కోసం పంపారు. జంట హత్యల వెనుక కారణాన్ని మేము ఇంకా కనుగొనలేదు. మేము వారి ఫోన్‌లను పరిశీలిస్తున్నాం. హంతకులను పట్టుకోవడానికి సిసిటివి ఫుటేజీలను సేకరిస్తున్నాము, ”అని మీరట్ ఎస్‌పి (సిటీ) పీయూష్ సింగ్ తెలిపారు.





Next Story