తిరుమ‌లగిరిలో డబుల్ మర్డర్.. అత్త‌, భార్య‌ను నరికి చంపిన వ్య‌క్తి

Double Murder In Tirumalagiri. సికింద్రాబాద్‌ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ మర్డర్ సంచ‌ల‌నం సృష్టించింది

By Medi Samrat
Published on : 16 Sept 2021 4:41 PM IST

తిరుమ‌లగిరిలో డబుల్ మర్డర్.. అత్త‌, భార్య‌ను నరికి చంపిన వ్య‌క్తి

సికింద్రాబాద్‌ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ మర్డర్ సంచ‌ల‌నం సృష్టించింది. తల్లీ, కూతురును అల్లుడు దారుణంగా నరికి చంపిన ఘ‌ట‌న గురువారం చోటుచేసుకుంది. వివ‌రాళ్లోకెళితే.. తిరుమలగిరి మిలటరీ హాస్పిటల్‌లో పని చేస్తుంది భార్య నాగ‌పుష్ప. అదే హాస్పిటల్ లో ఔట్సర్సింగ్ ఎలక్ట్రిషన్ గా ప‌నిచేస్తున్నాడు భ‌ర్త చిన‌బాబు. కుటుంబ కలహాల నేఫ‌థ్యంలో భార్య నాగ‌పుష్ప‌, అత్త కుమారిల‌ను హ‌త‌మార్చాడు. మిలటరీ క్వార్ట‌ర్స్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు.. క్లూస్ టీంతో స‌హా సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


Next Story