సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న.. 18 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి

Domestic help found dead in Bengaluru. ఓ అపార్ట్‌మెంట్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంట్లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న 18 ఏళ్ల యువతి బెంగళూరులో శనివారం ఉదయం

By అంజి  Published on  3 Jan 2022 4:06 PM IST
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న.. 18 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి

కర్ణాటకలో రాజధాని బెంగళూరులో ఓ 18 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బెల్లందూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంట్లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న 18 ఏళ్ల యువతి బెంగళూరులో శనివారం ఉదయం ఉరి వేసుకుని కనిపించింది. ఓ జాతీయ దిన పత్రిక కథనం ప్రకారం.. మృతురాలు జక్కసంద్రకు చెందిన కవితగా గుర్తించబడింది. గత ఎనిమిది నెలలుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వివేక్ కృష్ణన్ ఇంట్లో ఆ యువతి పనిచేస్తున్నారు.

ఇంజనీర్ వాకింగ్‌కు వెళ్లిన ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత కృష్ణన్ మృతదేహాన్ని గుర్తించి బెల్లందూరు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె వెంటిలేషన్ గ్రిల్‌కు వేలాడుతూ కనిపించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. కవిత తండ్రి కొన్నేళ్ల క్రితమే కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయారని, దీంతో ఆమె మనస్తాపానికి గురైందని ప్రాథమిక విచారణలో తేలింది.

Next Story