కుక్కను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసిన డాక్టర్.. ఎందుకు అలా చేశాడంటే..

Doctor killed dog with knife in Gwalior. గ్వాలియర్‌లో ఓ డాక్టర్ అతి కిరాతకంగా ప్రవర్తించాడు. వీధి కుక్కను తన చేతులతో

By Medi Samrat  Published on  30 Nov 2021 12:37 PM IST
కుక్కను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసిన డాక్టర్.. ఎందుకు అలా చేశాడంటే..

గ్వాలియర్‌లో ఓ డాక్టర్ అతి కిరాతకంగా ప్రవర్తించాడు. వీధి కుక్కను తన చేతులతో కత్తితో అతి కిరాతకంగా చంపాడు. ఆ మూగజీవం గట్టిగా అరుస్తూ ఉన్నా కూడా ఏ మాత్రం కనికరించకుండా.. ఆ కుక్క భాగాలను పదునైన కత్తితో కోస్తూ కనిపించాడు. అక్కడ ఉన్న వ్యక్తులు ఈ దారుణాన్ని రికార్డు చేస్తూ ఉన్నారు తప్పితే ఆ డాక్టర్ ను ఆపడానికి ఎవరూ ప్రయత్నించలేదు. అతడు ఇలా చేయడానికి కారణం ఆ వీధికుక్క ఆ డాక్టర్ కొడుకును కరిచింది. తన కుమారుడిని కరిచినందుకు ఆ డాక్టర్ ఇంత దారుణంగా ప్రవర్తించాడు. జంతు హక్కుల కార్యకర్తలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గ్వాలియర్‌లోని దబ్రా దేహత్ పోలీస్ స్టేషన్‌లోని సిమారియా గ్రామంలో చోటు చేసుకుంది. డాక్టర్ రాకేష్ బెంగాలీ కుమారుడిని వీధి కుక్క కరిచింది. దీంతో అతడికి విపరీతమైన కోపం వచ్చి.. కుక్కపై తన ప్రతాపాన్ని చూపించాడు.

మూగ జీవిపై కోపాన్ని చూపిస్తూ.. ప్రతీకారం తీర్చుకోవడానికి కుక్కను దారుణంగా కొట్టి, కాలు మరియు గొంతు దగ్గర కత్తితో కోసేశాడు. కొనప్రాణాలతో కొట్టుకుంటున్న సమయంలో అతను ఆ కుక్కను ముక్కలు చేశాడు. ఈ విషయానికి సంబంధించి జంతు ప్రేమికులు పోలీసు స్టేషన్‌ ను ఆశ్రయించారు. వైద్యుడి వింత ప్రవర్తనపై స్థానికులు ఆందోళన చెందుతున్నారని, అతన్ని అదుపులోకి తీసుకోవాలని అభ్యర్థించారు. ఇంజెక్షన్ తర్వాత డాక్టర్ కొడుకు క్షేమంగా ఉన్నాడు మరియు పూర్తిగా కోలుకున్నాడు. డాక్టర్ రాకేష్ బెంగాలీ కోపంతో వీధి కుక్క కోసం వెతకడం ప్రారంభించాడు. రెండు రోజుల తర్వాత కుక్కను గుర్తించినప్పుడు, వైద్యుడు దాన్ని పట్టుకుని అతి కిరాతకంగా ప్రవర్తించాడు.



Next Story