తమిళనాడులోని తిరుచెందూర్‌లోని ఒక నగల దుకాణంలో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) నాయకురాలు బంగారు గొలుసును దొంగిలించి, దాని స్థానంలో నకిలీ గొలుసును ఉంచారు. ఈ సంఘటన ఆగస్టు 20న చోటు చేసుకుంది. నగల దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో మహిళ బంగారు గొలుసులను తనిఖీ చేస్తుండగా మార్చేయడం గుర్తించారు. ఆమె ట్రేలో ఒక గొలుసును ఉంచి, మరికొన్ని డిజైన్లను తనకు చూపించమని యజమానిని కోరింది.
కొన్ని కొత్త డిజైన్‌లు తెచ్చేందుకు యజమాని లోపలికి వెళ్లగా, ఆ డీఎంకే నేత నకిలీ గొలుసుతో ఒరిజినల్ చైన్‌ను మార్చేసింది. యజమాని తేడాను గమనించకుండా ఉండేందుకు ఏకంగా ఆమె ప్రైస్ ట్యాగ్‌ను కూడా భర్తీ చేసింది. యజమాని తిరిగి వచ్చే సమయానికి, ఆమె అప్పటికే బంగారు గొలుసును నకిలీ గొలుసుతో భర్తీ చేసింది. సీసీటీవీ ఫుటేజీని గమనించిన ఓనర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోర్కోడి అనే మహిళ ఈ పనికి పాల్పడింది. ఆమె డీఎంకేకు చెందిన అంగమంగళం పంచాయతీ కౌన్సిల్ 8వ వార్డు కార్యదర్శి అట..!