మాట్లాడటం మానేసిందని యువ‌తిపై కత్తితో దాడిచేసిన‌ స్నేహితుడు

Delhi man repeatedly stabs woman after friendship turns sour. ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో సోమవారం నాడు 21 ఏళ్ల యువతిని ఆమె స్నేహితుడు

By Medi Samrat  Published on  4 Jan 2023 10:23 AM IST
మాట్లాడటం మానేసిందని యువ‌తిపై కత్తితో దాడిచేసిన‌ స్నేహితుడు

ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో సోమవారం నాడు 21 ఏళ్ల యువతిని ఆమె స్నేహితుడు పదే పదే కత్తితో పొడిచాడు. యువ‌తి త‌న‌తో స్నేహాన్ని తెంచుకోవ‌డ‌మే ఆ వ్యక్తి కోపానికి కార‌ణంగా తెలుస్తోంది. పట్టపగలు ఆ వ్య‌క్తి యువ‌తిని ఐదు నుండి ఆరు సార్లు కత్తితో పొడిచాడు. పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద కేసు న‌మోదు చేశారు. నిందితుడిని సుఖ్వీందర్ సింగ్ (22)గా గుర్తించారు.

యువ‌తి చాలా సంవత్సరాలుగా ఆ వ్యక్తితో స్నేహం చేసింది. కొద్దిరోజులుగా యువ‌తి సుఖ్వీందర్ సింగ్ తో మాట్లాడటం మానేసింది. దీంతో ఆగ్రహించిన సుఖ్వీందర్ సింగ్.. ఆమెపై దాడి చేసి ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అతడు అంబాలాలో ఉన్నాడని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని జహంగీర్‌పురిలోని బాబు జగ్జీవన్ రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి నిలకడగా ఉంది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.


Next Story