భార్యను చంపాడు.. బాత్ రూమ్ లో దాచాడు.. చివరికి..

Delhi man murders wife, hides corpse in bathroom. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి శవాన్ని ఇంట్లోని బాత్‌రూమ్‌లో దాచాడు.

By Medi Samrat  Published on  19 Jun 2022 5:15 PM IST
భార్యను చంపాడు.. బాత్ రూమ్ లో దాచాడు.. చివరికి..

ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి శవాన్ని ఇంట్లోని బాత్‌రూమ్‌లో దాచాడు. ఢిల్లీలోని కపిల్ విహార్‌కు చెందిన విజయ్ (38) జూన్ 18న తన భార్యను హత్య చేసినట్లు భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్‌లో అధికారులకు సమాచారం అందించాడు. విచారణ అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలు సంతోషి దేవిని గుడ్డలో చుట్టి ఉంచినట్లు గుర్తించారు.

కేసు నమోదు చేయగా, విజయ్‌కి ఇంతకు ముందు మరో మహిళతో వివాహం జరిగిందని, అతనికి నలుగురు పిల్లలు ఉన్నారని అధికారులు గుర్తించారు. అతని మొదటి భార్య అతని నుండి విడిపోయింది. అనంతరం ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న బాధితురాలిని కలిశాడు. మృతురాలు సంతోషికి నలుగురు పిల్లలు, 14, 13, 12 ఏళ్ల ముగ్గురు బాలికలు, 8 ఏళ్ల బాలుడు ఉన్నారు. ఆమె కూడా భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది.

ఇంతలో విజయ్, సంతోషి సహజీవనం చేయడం ప్రారంభించారు. వీరికి ఒక బిడ్డ కూడా ఉన్నారు. పిల్లలందరి సంరక్షణకు సంబంధించి విజయ్, సంతోషి మధ్య కొన్ని చిన్న సమస్యలు తలెత్తాయి. జూన్ 17 సాయంత్రం, సంతోషి పని నుండి తిరిగి రాగా, రాత్రి 11.30 గంటల సమయంలో గొడవ జరిగింది. పిల్లలందరూ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిద్రిస్తుండగా విజయ్, సంతోషి మిద్దెపై ఉన్నారు. గొడవ మరింత ముదరడంతో నిందితుడు సంతోషిని గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని పారవేసేందుకు గుడ్డలో చుట్టాడు. కానీ, అతను అనుకున్నది చేయలేకపోయాడు. జూన్ 18 రాత్రి 8.45 గంటల ప్రాంతంలో పోలీసులను ఆశ్రయించాడు. నేరాన్ని అంగీకరించాడు.













Next Story