ట్యూషన్ చెబుతానంటూ ఇంటికి పిలిచి మైనర్ బాలిక‌పై అత్యాచారం, ఆపై హ‌త్య‌.. నిందితుడి బెయిల్‌పై కోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం

నమాజ్ ట్యూషన్ చెబుతానంటూ మైనర్‌ను ఇంటికి పిలిపించి అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

By Medi Samrat
Published on : 13 July 2025 5:46 PM IST

ట్యూషన్ చెబుతానంటూ ఇంటికి పిలిచి మైనర్ బాలిక‌పై అత్యాచారం, ఆపై హ‌త్య‌.. నిందితుడి బెయిల్‌పై కోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం

నమాజ్ ట్యూషన్ చెబుతానంటూ మైనర్‌ను ఇంటికి పిలిపించి అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బాధితురాలు హింసాత్మకంగా, పదేపదే లైంగిక వేధింపులకు గురైనట్లు పోస్టుమార్టం నివేదికలో స్పష్టమవుతోందని జస్టిస్ స్వర్ణ్ కాంత శర్మతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం.. మృతదేహం లభించిన ప్రదేశంలో లభించిన సీవీటీవీ ఫుటేజీ నిందితులకు నేరంతో సంబంధం కలిగి ఉందని పేర్కొంది. ఇది కాకుండా ఫోరెన్సిక్ నిపుణుల ప్రకారం.. నిందితుడి ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న పాలీ బ్యాగ్‌తో, సంఘటనా స్థలంలో విసిరిన పాలీ బ్యాగ్‌ పోలి ఉన్నట్లు కనుగొనబడింది.

2018 సంవత్సరంలో మైనర్‌పై అత్యాచారం హత్య కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్, మెడికల్, డాక్యుమెంటరీ సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని నిందితులకు బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు మొగ్గు చూపడం లేదని కోర్టు తెలిపింది.

నేరం, నిందితుడి హేయమైన, క్రూరమైన స్వభావం.. ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. నిందితులకు బెయిల్ మంజూరు చేయడానికి ఎటువంటి కారణం లేదని కోర్టు పేర్కొంది. అయితే ఈ కేసులో సాక్ష్యాధారాలను త్వరగా నమోదు చేయాలని ట్రయల్ కోర్టును ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో మొత్తం 36 మంది సాక్షులకు గాను ప్రాసిక్యూషన్ 14 మంది సాక్షులను విచారించగలిగిందని కోర్టు పేర్కొంది.

నమాజ్‌ ట్యూషన్ చెబుతాన‌ని చెప్పి 10-12 ఏళ్ల వయసున్న మైనర్‌ బాధితురాలిని నిందితుడు తన భార్యతో కలిసి తమ ఇంటికి పిలిపించుకున్నట్లు ఆరోపణలున్నాయి. అనంతరం ఆమెకు మత్తు మందు ఇచ్చి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి పరిస్థితి విషమించడం చూసిన నిందితుడు ఆమెను గొంతుకోసి హత్య చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు నిందితుడు మైనర్ మృతదేహాన్ని మారుమూల ప్రాంతంలో పడేసి సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.

Next Story