హిట్ అండ్ ర‌న్‌.. 12 ఏళ్ల మేనల్లుడి రైడ్ స‌ర‌దా.. న‌లుగురి ప్రాణం తీసింది

ఉత్త‌రాఖండ్‌ డెహ్రాడూన్‌లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  13 March 2025 3:31 PM IST
హిట్ అండ్ ర‌న్‌.. 12 ఏళ్ల మేనల్లుడి రైడ్ స‌ర‌దా.. న‌లుగురి ప్రాణం తీసింది

ఉత్త‌రాఖండ్‌ డెహ్రాడూన్‌లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్‌పూర్ రోడ్డులో అదుపుతప్పిన కారు పాదచారులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హిట్ అండ్ రన్ కేసులో కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సమాచారం ప్రకారం.. రాజ్‌పూర్‌లోని సాయి దేవాలయం సమీపంలో వేగంగా వచ్చిన మెర్సిడెస్ బెంజ్‌ కారు పాదచారులు.. వాహనాల‌పై ప్రయాణిస్తున్న వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు గాయపడినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి ఎస్‌ఎస్పీ అజయ్‌సింగ్ చేరుకున్నారు. ఘటన తర్వాత మెర్సిడెస్ డ్రైవర్ పరార‌వ్వ‌గా.. తర్వాత అత‌డిని అరెస్టు చేశారు.

నిందితుడైన‌ కారు డ్రైవర్ తన 12 ఏళ్ల మేనల్లుడును రైడ్‌కు తీసుకెళ్లినట్లు ఇప్పటి వరకు జరిపిన విచారణలో తేలింది. నిందితుడి బావమరిది తండ్రి పేరు మీద కారు రిజిస్టర్ చేయబడింది. ప్రమాదం అనంతరం నిందితుడు తన మేనల్లుడును ఇంట్లో దించి పారిపోయాడు.

Next Story