ఆర్మూర్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Degree student commits suicide in Armour. తెలంగాణలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వ‌చ్చింది.

By Medi Samrat  Published on  19 Jun 2023 2:11 PM IST
ఆర్మూర్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వ‌చ్చింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఆదివారం రాత్రి డిగ్రీ విద్యార్థిని గోలి రక్షిత ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడింది. పట్టణంలోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న రక్షిత.. స్థానికంగా ఎస్సీ ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటుంది. ఆదివారం రాత్రి స్నేహితులంతా భోజనానికి వెళ్తుండ‌గా.. తాను మాత్రం తినకుండా తన గదికి వెళ్లింది. తోటి స్నేహితులు బోజ‌నానికి ర‌మ్మ‌ని అడగ‌గా.. కాసేపటి తర్వాత తింటానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. గంట తర్వాత రక్షితకు తన స్నేహితులు ఫోన్‌ చేయగా.. కాల్‌ లిఫ్ట్ చేయలేదు. దీంతో వార్డెన్ రక్షిత గది వద్దకు వెళ్లి చూడ‌గా తలుపు గడియ పెట్టింది. కిటికీ తెరిచి చూడగా రక్షిత ఫ్యాన్​కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. రక్షిత మృతికి సంబంధించిన కార‌ణాలు తెలియాల్సివుంది.




Next Story