రకుల్ సోదరుడు అమన్ గురించి పోలీసులు చెబుతోంది ఇదే.!

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. ఇందులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి.

By Medi Samrat
Published on : 15 July 2024 7:52 PM IST

రకుల్ సోదరుడు అమన్ గురించి పోలీసులు చెబుతోంది ఇదే.!

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. ఇందులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. డీసీపీ శ్రీనివాస్ దీనిపై స్పందించారు. ఈ డ్రగ్స్ కేసులో ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ కూడా ఉన్నారని.. ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. డ్రగ్స్ గ్యాంక్ కు కీలక సూత్ర దారి ఏకుబా సుజి అని.. అతడిపై రూ. 2 లక్షల రివార్డ్ ఉందని తెలిపారు. ప్రస్తుతం ఏకుబా పరారీలో ఉన్నారని తెలిపారు. డ్రగ్స్ సప్లయర్ లో ఓకొరియోగ్రాఫర్ కూడా ఉన్నారని తెలిపారు.

ఐదుగురి శాంపిల్స్ తీసుకున్నామని అందులో అమన్ సింగ్ కు పాజిటీవ్ వచ్చిందన్నారు డీసీపీ శ్రీనివాస్. అమన్ సింగ్ ను వినయోగదారుడిగానే విచారిస్తున్నామని చెప్పారు. ఐదుగురు డ్రగ్స్ పెడ్లర్స్ నుండి 35 లక్షల విలువ చేసే 199 గ్రాముల కొకైన్ లభ్యమైందన్నారు. 6 నెలల్లో 30 మంది వీఐపీ కస్టమర్స్ కు కొకైన సరఫరా చేశారని విచారణలో తెలిసిందన్నారు.

Next Story