హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. తల్లి మీద కోపంతో కూతురు విచక్షణారహి తంగా కొట్టి చంపేసింది. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఎస్సార్ నగర్ లో 90 ఏళ్ల వయసు ఉన్న వృద్ధురాలు, ఆమె కూతురు నివాసం ఉంటు న్నారు. కూతురు, తల్లిని టాబ్లెట్లు వేసుకోమని చెప్పింది. కానీ తల్లి టాబ్లెట్లు వేసుకోలేదు. దీంతో మానసిక రోగి అయిన కూతురుకు ఆగ్రహం వచ్చి.. టాబ్లెట్లు ఎందుకు వేసుకో లేదంటూ తల్లిని గట్టి గట్టిగా తిడుతూ ఒక్కసారి గా రాడ్‌తో తల్లిపై దాడి చేసి కొట్టి చంపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. కూతురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.