కేరళలోని ఇదయపురంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 21 ఏళ్ల న్యాయ విద్యార్థిని మోఫియా పర్వీన్ దిల్షాద్ ఆత్మహత్య చేసుకుంది. మోఫియా సూసైడ్ లెటర్‌ను కూడా వదిలిపెట్టినట్లు చెబుతున్నారు. ఆ లేఖలో 'నాన్న, మీరు చెప్పింది నిజమే. అతను మంచి మనిషి కాదు. ' అని ఉంది.
సూసైడ్ నోట్‌లో మోఫియా తన మరణానికి తన భర్త ముహమ్మద్ సుహైల్, బావ యూసుఫ్, అత్తగారు రుఖియా కారణమని తెలిపింది. మరణించిన యువతి తండ్రి మాట్లాడుతూ "తన కుమార్తె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తెను ఆమె అత్తమామలు చాలా హింసించారని అతను చెప్పాడు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని" అన్నారు. కొద్దిరోజుల క్రితం మోఫియా కుటుంబం ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసిందని.. ఆపై చర్యలు తీసుకోవాలని ఆలువా పోలీస్ స్టేషన్‌లో ఆదేశించారని తెలుస్తోంది.
అయితే ఆలువా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీఎల్ సుధీర్ మోఫియా భర్త ముహమ్మద్ సుహైల్ మరియు అతని కుటుంబానికి అండగా నిలిచాడని ఆరోపనిస్తున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం.. వారు మరింతగా హింసిస్తూ ఉండడంతో మోఫియా నిరాశ చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అందిన సమాచారం ప్రకారం మోఫియా, మహమ్మద్ సుహైల్‌లు ఫేస్‌బుక్ ద్వారా కలిశారు. కొద్దిరోజుల పాటు చాటింగ్ చేసుకుంటూ ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు.