అసలే డ్యాన్స్ పార్టీ.. 13 మంది డ్యాన్సర్లు.. వెనుక జరుగుతున్న బాగోతం ఏమిటంటే?
నాగ్‌పూర్ సమీపంలోని పచ్‌గావ్‌లోని రిసార్ట్‌లో డ్యాన్స్ పార్టీని నిర్వహించారు.
By Medi Samrat Published on 2 Oct 2023 3:16 PM GMTనాగ్‌పూర్ సమీపంలోని పచ్‌గావ్‌లోని రిసార్ట్‌లో డ్యాన్స్ పార్టీని నిర్వహించారు. అయితే పోలీసులకు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందింది. దీంతో ముప్పై ఏడు మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. చాలా మంది వ్యక్తులు సెమీ న్యూడ్‌గా కనిపించారని.. అసభ్యకరంగా నృత్యం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఆదివారం అర్థరాత్రి ఈ దాడి జరిగింది. 13 మంది డ్యాన్సర్లతో సహా 37 మందిని అరెస్టు చేసారు. ఓ పురుగుల మందు కంపెనీ ఈ ఈవెంట్ ను నిర్వహించింది. ఐదు ఎస్‌యూవీలు, మద్యం బాటిళ్లు, రూ.1.12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ శిక్షాస్మృతి, మహారాష్ట్ర పోలీసు చట్టం కింద కేసులు నమోదు చేశారు.
పూణె పోలీసులు మరో ఘటనలో రూ.2 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైలు ఖైదీని కూడా వారు ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. సాసూన్ జనరల్ హాస్పిటల్ సమీపంలో డ్రగ్స్ వ్యాపారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పూణె పోలీసుల యాంటీ నార్కోటిక్ స్క్వాడ్ అప్రమత్తమైంది. ఆసుపత్రి వెలుపల సుభాష్ మండల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా.. అతడి నుండి దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన 2 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.