ఈ-కామర్స్ పోర్టల్స్‌లో గిఫ్ట్ కార్డులు పంపిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ఆరోపణలపై బీహార్‌కు చెందిన ఓ వ్యక్తిని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో 22 కేసుల్లో ఇతనికి సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని నుంచి రూ.3.5 లక్షలు, మొబైల్ ఫోన్లు, చెక్ బుక్‌లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. బీహార్‌లోని నవాడాకు చెందిన రాజేష్ మహతో (37) నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాలోని రూ.21 లక్షలు ప్రీజ్ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.
రాజేష్ అమాయనక ప్రజలను నమ్మించి ఈ-కామర్స్ పోర్టల్స్ నుండి గిప్ట్ కార్డులు, లాటరీలను అందజేస్తానంటూ మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. "ఈ ప్రక్రియలో భాగంగా అతను, అతని సహచరులు కస్టమర్ల వ్యక్తిగత, బ్యాంకు వివరాలను పొందేవారు. లాటరీలు, బహుమతులు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేసేవారు. డబ్బు తీసుకున్న తర్వాత.. పోలీసు ట్రాకింగ్ నుండి తప్పించుకోవడానికి.. బ్యాంకు ఖాతాలతో అనుసంధానమైన సిమ్ కార్డులను ధ్వంసం చేసేవారని పోలీసులు తెలిపారు. ఇటీవల మహతో మరియు అతని ముఠా త్రిముల్‌ఘేరీకి చెందిన ఒక మహిళను రూ.28 లక్షల మోసం చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రాజేష్ ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు. నవాడ జిల్లా పోలీసుల సహాయంతో అరెస్ట్ చేసి నిందితుడిని హైదరాబాద్ కు తీసుకొచ్చారు.