ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బైక్‌లపై వచ్చిన ఇద్దరు చైన్ స్నాచర్లు చైన్ లాక్కోవడానికి తెగ ప్రయత్నించారు. అయితే అది వీలవ్వకపోవడంతో తమ దగ్గర ఉన్న మారణాయుధాలు తీసి ప్రజలను బెదిరించి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఘజియాబాద్‌లోని సాహిబాబాద్‌లోని రజనిగంధ ఫ్లాట్ సమీపంలో చైన్ స్నాచర్లు మహిళ గొలుసును దొంగిలించడానికి ప్రయత్నించారు.
అది కాస్తా విఫలమైంది. అక్కడ ఉన్న వ్యక్తులచే చుట్టుముట్టబడ్డారు. స్థానికులు తమ చుట్టూ చుట్టుముట్టారని తెలుసుకున్న ఇద్దరు కిడ్నాపర్లు పిస్టల్‌ను బయటకు తీశారు. మోటార్ సైకిల్‌పై పారిపోయే ముందు అక్కడున్న వ్యక్తులపై తుపాకులను ఎక్కుపెట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు శుక్రవారం నాడు ఈ సంఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో మరీ ఎక్కువయ్యాయని.. పోలీసులు దుండగులను పట్టుకోవాలని ప్రజలు కోరుతూ ఉన్నారు.