ఇన్‌స్టాలో పరిచయం, మహిళా పోలీస్ ఆఫీసర్ గొంతుకోసి చంపిన CRPF జవాన్
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam KarthikPublished on : 20 July 2025 9:15 AM IST
Next Story
ఇన్‌స్టాలో పరిచయం, మహిళా పోలీస్ ఆఫీసర్ గొంతుకోసి చంపిన CRPF జవాన్
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా పోలీస్ అధికారిణిని సీఆర్పీఎఫ్ జవాన్ గొంతుకోసి హత్య చేశాడు. కాగా నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కచ్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ASIగా విధులు నిర్వహిస్తోన్న అరుణకు.. CRPF జవాన్ దిలీప్‌తో ఇన్ స్టా గ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. కాగా అది కాస్త లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌కు దారి తీసింది.
ఈ క్రమంలోనే వీరిద్దరూ అంజార్‌లని గంగోత్రి సొసైటీలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి అరుణ, దిలీప్ మధ్య ఏదో విషయంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన దిలీప్ అరుణను గొంతు కోసి చంపాడు. పరిస్థితి మరింత దిగజారడంతో శనివారం ఉదయం నిందితుడు దిలీప్ కచ్‌లోని అంజార్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.