ఏకే-47తో కాల్చుకుని చనిపోయిన CRPF అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్

CRPF ASI shoots self dead at IB director's residence in Delhi. 53 ఏళ్ల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ శుక్రవారం నాడు

By Medi Samrat  Published on  4 Feb 2023 8:00 PM IST
ఏకే-47తో కాల్చుకుని చనిపోయిన CRPF అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్

53 ఏళ్ల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ శుక్రవారం నాడు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ ప్రాంతంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్ నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్ రాజ్‌బీర్ కుమార్ తన సర్వీస్ రైఫిల్ ఏకే-47తో తనపై రెండు రౌండ్లు కాల్చుకున్నాడు. అతని పోస్టింగ్ IB డైరెక్టర్ నివాసంలో ఏర్పాటు చేశారు. కుమార్ గత కొన్ని రోజులుగా సెలవులో ఉండగా శుక్రవారం తిరిగి విధుల్లో చేరాడు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. బాధితుడి కుటుంబానికి సమాచారం అందించారు. CrPC సెక్షన్ 174 కింద విచారణ చర్యలు ప్రారంభించబడ్డాయి.

"అతను ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నివాసం దగ్గర గార్డు పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. శనివారం పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Next Story