సీపీఐఎం కార్యకర్తను నరికి చంపిన దుండగులు
CPI(M) worker hacked to death in Kerala. ఫిబ్రవరి 21, సోమవారం తెల్లవారుజామున తలస్సేరిలోని న్యూ మహే సమీపంలోని పున్నోల్‌లో కమ్యూనిస్ట్ పార్టీ
By అంజి Published on 21 Feb 2022 2:01 AM GMT
ఫిబ్రవరి 21, సోమవారం తెల్లవారుజామున తలస్సేరిలోని న్యూ మహే సమీపంలోని పున్నోల్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఐ(ఎం)) కార్యకర్తను నరికి చంపారు. మరణించిన మత్స్యకారుడు హరిదాస్ ఉదయం 1 గంటల సమయంలో పని నుండి తిరిగి వస్తున్నాడు. సోమవారం ఆయనపై దాడి జరిగింది. రెండు బైక్‌లపై వచ్చిన కొందరు హరిదాస్‌పై దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని సోదరుడు గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. స్థానిక ఆలయ ఉత్సవం విషయంలో సీపీఐ(ఎం), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తల మధ్య జరిగిన గొడవ దాడికి, హత్యకు దారితీసిందని ఆరోపించారు.
ఈ హత్యలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రమేయం ఉందని సీపీఐ(ఎం) నాయకత్వం ఆరోపించింది. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణల ఫలితంగా జరిగిన దారుణమైన చర్య ఇదేనని సీపీఐ (ఎం) నేత ఎంవీ జయరాజన్ ఆరోపించారు. హత్యకు దారితీసే ఘటనలు జరగకముందే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్నారు. హరిదాస్ మృతదేహం ప్రస్తుతం పరియారం మెడికల్ కాలేజీలో ఉంది. అతని సోదరుడు సూరన్ తలస్సేరిలోని సహకార ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యను నిరసిస్తూ న్యూ మహే పనహ్యాట్, తలస్సేరి మున్సిపాలిటీలో హర్తాళ్ పాటించనున్నారు.