నిర్జీవంగా తల్లీతండ్రి.. ఏడుస్తూ పిల్లలు..

Couple found dead at home in Bhopal. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో శనివారం రాత్రి భార్యాభర్తలు ఇంట్లో నిర్జీవంగా పడి ఉన్నారు.

By Medi Samrat  Published on  30 May 2022 3:00 PM IST
నిర్జీవంగా తల్లీతండ్రి.. ఏడుస్తూ పిల్లలు..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో శనివారం రాత్రి భార్యాభర్తలు ఇంట్లో నిర్జీవంగా పడి ఉన్నారు. భార్యాభర్తల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో సూసైడ్ నోట్ కనుగొనబడలేదు. భార్యాభర్తలు తమ రెండున్నరేళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తెతో కలిసి నిషాత్‌పురాలోని సంజీవ్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ఈ జంట విషం తాగి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భర్త హేమంత్‌, అతని భార్య బబిత విషం తాగినట్లు శనివారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది.

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దంపతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. హేమంత్, బబిత ఈ ఇంట్లో అద్దెకు ఉంటున్నారని, ఇద్దరూ మామూలుగానే ఉన్నారని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. వారు పోట్లాడుకోవడం ఎప్పుడూ చూడలేదు.. ఈ నిర్ణయం తీసుకోడానికి వెనుక కారణం ఇంకా నిర్ధారించబడలేదు. ఘటనా స్థలం నుంచి విషాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించారు. ఇంటిని సీజ్ చేశారు. కేసును ఛేదించడానికి పోలీసులు కాల్ రికార్డ్ వివరాలన విశ్లేషిస్తున్నారు. మృతుల పిల్లలను వారి బంధువులకు అప్పగించిన పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.










Next Story