కుటుంబ కలహాలతో దంప‌తుల ఆత్మ‌హ‌త్య

Couple ends life over family disputes in Asifabad. క్ష‌ణికావేశం రెండు జీవితాల‌ను బ‌లితీసుకుంది. భర్త మద్యానికి బానిసయ్యాడని

By Medi Samrat  Published on  2 Aug 2022 7:08 PM IST
కుటుంబ కలహాలతో దంప‌తుల ఆత్మ‌హ‌త్య

క్ష‌ణికావేశం రెండు జీవితాల‌ను బ‌లితీసుకుంది. భర్త మద్యానికి బానిసయ్యాడని ఆందోళన చెందిన ఓ మహిళ చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. భార్య‌ ఆత్మహత్య విషయం తెలుసుకున్న భర్త కూడా అదే చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

మద్యానికి అలవాటు పడిన విషయమై భార్య‌ మంగ(30)కు భ‌ర్త‌ పాలె సంతోష్ (35) తో వాగ్వాదం జరిగింది. క్ష‌ణికావేశంలో మంగ చెరువు వద్దకు వెళ్లి నీటిలో దూకింది. భార్య మ‌ర‌ణంతో ఆందోళన చెందిన సంతోష్ కూడా చెరువు వద్దకు వెళ్లి అందులోకి దూకాడు. స్థానికులు ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఘ‌ట‌న‌పై పోలీసుల విచారణ కొనసాగుతోంది.





Next Story