రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. అతివేగంగా వచ్చిన కియా కారు బైక్‌ను ఢీ కొట్ట‌డంతో దంప‌తులు మృతి చెందారు.

By -  Medi Samrat
Published on : 16 March 2026 10:51 AM IST

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. అతివేగంగా వచ్చిన కియా కారు బైక్‌ను ఢీ కొట్ట‌డంతో దంప‌తులు మృతి చెందారు. వివ‌రాళ్లోకెళితే.. రాంనగర్‌కు చెందిన మర్రి ప్రశాంత్ (35), అతని భార్య శ్రావణి (33), కుమారుడు సహస్రన్‌(12) ముగ్గురు బైక్‌పై రాంనగర్ నుండి మేడిపల్లిలోని బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో మేడిపల్లి పీఎస్ పరిధిలోని డెకాథ్లాన్ సమీపానికి రాగానే వెనుక నుండి అతివేగంగా వచ్చిన కియా కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మర్రి ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య శ్రావణి తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితిలో ఉండగా, కుమారుడు సహస్ర‌న్‌కు గాయాలు అయ్యాయి. ఢీకొట్టిన అనంతరం కారు బైక్‌ను కొద్ది దూరం వరకు ఈడ్చుకుపోయినట్లు సీసీటీవీ లో రికార్డు అయింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శ్రావణి మరణించింది. సహస్రన్‌ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతుడు ప్రశాంత్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు. కారు న‌డిపిన వ్య‌క్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story