Hyderabad : ఆటో డ్రైవర్‌ను హానీ ట్రాప్ చేసి చంపారు.. అంతకుముందు ఏం జరిగిందంటే..
మార్చి 2023లో ఆటో డ్రైవర్‌ను హనీ ట్రాప్ చేసి చంపిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 22 Dec 2024 7:30 PM ISTమార్చి 2023లో ఆటో డ్రైవర్‌ను హనీ ట్రాప్ చేసి చంపిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జగద్గిరిగుట్టలో నివాసముంటున్న భార్యాభర్తలు నిజాంపేటలో నివాసముంటున్న ఆటోడ్రైవర్ కుమార్ (30)ని ట్రాప్ చేసేందుకు పథకం వేశారు. దంపతుల కుమార్తె(7)ని ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి యూసుఫ్‌గూడలోని ఓ గదిలోకి తీసుకెళ్లి దాడికి యత్నించాడు. ఆమె తప్పించుకోగలిగింది. పోలీసులకు దొరికింది. ఆమె అనాథ అని భావించి, ప్రత్యేక హోమ్‌కు ఆమెను పంపారు పోలీసులు. మరోవైపు దంపతులు తమ కుమార్తె కోసం వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు.
తల్లిదండ్రులు ఆన్‌లైన్ తరగతుల కోసం COVID కాలంలో కుమార్తె కోసం కొనుగోలు చేసిన ల్యాప్ టాప్ ను పరిశీలించారు. ఆటో డ్రైవర్ కుమార్ కు సంబంధించిన స్నాప్‌చాట్ కాంటాక్ట్ ను వాళ్లు కనుగొన్నారు. అతడే కిడ్నాప్ చేసినట్లు అనుమానించారు. ఆ జంట కొత్త స్నాప్‌చాట్ ఐడీని క్రియేట్ చేసి అతడిని ట్రాప్ చేశారు. మాదాపూర్‌లో తమను కలవాలని అతనిని నమ్మించారు. అక్కడ వారు తమ కుమార్తె గురించి ప్రశ్నించారు. మీ కూతురు పారిపోయిందని కుమార్ చెప్పడంతో అతడిపై దాడి చేశారు. వీరి దాడిలో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. అనంతరం సూర్యాపేటకు తీసుకెళ్లి మృతదేహాన్ని రాయితో కట్టి నాగార్జున సాగర్ ఎడమ కాల్వలోకి విసిరేశారు.
ఇక బోరబండలో కుమార్ కుటుంబసభ్యులు కనిపించకుండా పోయాడని పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత పాప తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుంది. కుమార్ నడిపిన ఆటోను వేరే వ్యక్తులు ఉపయోగిస్తున్నట్లు కుమార్ బంధువులు కనుగొన్నారు. వాహనాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.