భార్య, పిల్లాడు, పెంచుకున్న కుక్కను కాల్చి చంపి.. ఆ తర్వాత

Cop kills wife and son with service weapon in Punjab's Gurdaspur. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఊహించని

By Medi Samrat  Published on  4 April 2023 9:15 PM IST
భార్య, పిల్లాడు, పెంచుకున్న కుక్కను కాల్చి చంపి.. ఆ తర్వాత

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఊహించని దారుణానికి తెగబడ్డాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో భార్య, కొడుకు, పెంపుడు కుక్కను కాల్చి చంపాడు. అమృత్‌సర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ భూపీందర్ సింగ్ తన సర్వీస్ వెపన్‌తో అతని భార్య బల్జీత్ కౌర్ (40), కుమారుడు లవ్‌ప్రీత్ సింగ్ (19)లను హత్య చేశాడు. తన పెంపుడు కుక్కను కూడా కాల్చి చంపి పారిపోయాడు. కొన్ని గంటల తర్వాత భూపీందర్ సింగ్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

సింగ్ ఈ దారుణానికి ఒడిగట్టడానికి కారణం ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదని, ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గురుదాస్‌పూర్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


Next Story