Hyderabad : అత్తాపూర్‌లో హిట్ అండ్ రన్.. కానిస్టేబుల్ దుర్మ‌ర‌ణం

అత్తాపూర్ హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతిచెందారు.

By -  Medi Samrat
Published on : 23 Dec 2025 5:22 PM IST

Hyderabad : అత్తాపూర్‌లో హిట్ అండ్ రన్.. కానిస్టేబుల్ దుర్మ‌ర‌ణం

అత్తాపూర్ హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతిచెందారు. DCM వాహనం బైక్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్ర‌మాదం జరిగింది. ఈ ప్ర‌మాదంతో బైక్‌పై వెళ్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందారు. మృతుడిని టౌలిచౌకి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వ‌హిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అబ్దుల్ సత్తార్‌గా గుర్తించారు. సత్తార్‌ విధులు ముగించుకొని ఇంటికి బ‌య‌లుదేర‌గా అత్తాపూర్ పీవీఎన్ఆర్‌ పిల్లర్ వద్దకు రాగానే వేగంగా వ‌చ్చిన‌ DCM బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో DCM చక్రాల ప‌డి సత్తార్ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. బైక్‌ను ఢీ కొట్టిన DCM డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు గమనించి DCMను వెంబడించారు. సుమారు ఐదు కిలోమీటర్లు వెంబ‌డించి డ్రైవర్‌ను ప‌ట్టుకున్నారు. ప్ర‌మాదంపై కేసు నమోదు చేసిన‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story