ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకున్న కండక్టర్​

Conductor hanged in RTC bus. మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులోని ఓ ఆర్టీసీ బస్సులో కండక్టర్​ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

By Medi Samrat
Published on : 13 March 2023 3:15 PM IST

ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకున్న కండక్టర్​

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులోని ఓ ఆర్టీసీ బస్సులో కండక్టర్​ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని కంఠాయపాలెం గ్రామానికి చెందిన గార్లపాటి మహేందర్​ రెడ్డి (55) తొర్రూరు టీచర్స్​ కాలనీలో ఉంటూ ఆర్టీసీ డిపోలో కండక్టర్​గా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యంగా ఉందని లీవ్ తీసుకున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు తిరిగి డ్యూటీలో జాయిన్​ అయి సెక్యూరిటీ ఆఫీసు రిజిస్ర్టర్​లో సంతకం పెట్టి డిపోలోకి వెళ్లాడు. ఎంత సేపయినా తిరిగి రాకపోవడంతో సెక్యూరటీ సిబ్బంది వెళ్లి చూడగా ఆర్టీసీ డిపో ఆవరణలో పార్క్​ చేసిన బస్సులో టవల్ తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. డిపో అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీశ్ ​తెలిపారు. మృతుడికి ఇద్దరు కొడుకులున్నారు. సూసైడ్​కు ఆర్టీసీ అధికారులు వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు. మృతిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. మహేందర్​రెడ్డి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story