కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ద్యుతీ చంద్

ఒడిషా రాష్ట్రం కటక్ జిల్లాలోని ఓఎంపీ చౌక్ సమీపంలో అథ్లెట్ ద్యుతీ చంద్ కారు ప్రమాదానికి గురైంది.

By Kalasani Durgapraveen  Published on  13 Dec 2024 11:13 AM IST
కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ద్యుతీ చంద్

ఒడిషా రాష్ట్రం కటక్ జిల్లాలోని ఓఎంపీ చౌక్ సమీపంలో అథ్లెట్ ద్యుతీ చంద్ కారు ప్రమాదానికి గురైంది. ద్యుతీ చంద్ కారును లారీ ఢీకొట్టింది. ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే ఆమె కారు దెబ్బతింది. పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సమాచారం ప్రకారం.. ద్యుతీ చంద్ తన స్నేహితుల‌తో కలిసి కారులో జాజ్‌పూర్ నుండి భువనేశ్వర్‌కు వస్తుండగా OMP చౌక్ సమీపంలో లారీ ఆమె కారును ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అతనిని వెంబడించి పట్టుకున్నారు.

ఈ ఘటనపై ద్యుతీ చంద్ మధుపట్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే కేసు విచారణ కూడా కొనసాగుతోంది. ద్యుతీ చంద్ కారు డ్యామేజ్ కాగా.. ఆమె సురక్షితంగా ఉంది.

Next Story