16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హైదరాబాద్‌లో ఘటన

Class 10 student Sexual assault by man in Hyderabad. హైదరాబాద్‌ నగర పరిధిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌లో టీనేజీ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి

By అంజి  Published on  30 Dec 2021 9:01 AM GMT
16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హైదరాబాద్‌లో ఘటన

హైదరాబాద్‌ నగర పరిధిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌లో టీనేజీ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు గురువారం తెలిపారు. పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక అదే పరిసరాల్లోని అనుమానితుడికి తెలుసు. నిందితుడు బాలికతో స్నేహం చేశాడని, వారు దాదాపు ఏడాది కాలంగా స్నేహితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో అతను ఆమెను తన మోటార్‌సైకిల్‌పై హిమాయత్ సాగర్ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని, కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మహిళలకు, చిన్నారులకు కామాంధుల నుండి రక్షణ కరువు అవుతోంది. మహిళ కనిపిస్తే చాలు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కఠినాతికఠినమైన చట్టాలు తీసుకురావాల్స ఉంది.

Next Story
Share it