అమ్మాయి విషయంలో గొడవ పడి ఇంటర్ విద్యార్థిని కత్తితో పొడిచాడు తోటి విద్యార్థి. బాధిత విద్యార్థికి రక్తం కారుతుండగా అతడితో సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్, రాజేంద్ర నగర్ పరిధిలోని అత్తాపూర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్‌లో మంగళవారం రాత్రి 10వ తరగతి విద్యార్థిపై అతని ఇద్దరు స్నేహితులు కత్తితో దాడి చేశారు. ఫిల్మ్ నగర్‌లోని ఓ పాఠశాలలో చదువుతున్న బాధితుడు దుర్గాప్రసాద్‌ను ఇద్దరు స్నేహితులు మంగళవారం సాయంత్రం ఫిల్మ్ నగర్‌లో పార్టీ చేసుకోవడానికి బయటకు తీసుకెళ్లారు. అనంతరం రాత్రి గండిపేటకు వెళదామని.. ఇద్దరు మోటర్‌సైకిల్‌పై రాజేంద్రనగర్‌లోని టిప్పుఖాన్ వంతెన వద్దకు తీసుకెళ్లి కత్తితో దాడికి పాల్పడ్డారు.
రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసును బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బాలుడిని కత్తితో పొడిచిన విద్యార్థితో పాటు మరొక బాలుడిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఓ విద్యార్థి తన స్నేహితుడితో కలిసి ముందస్తు ప్రణాళిక ప్రకారం కత్తి కూడా తీసుకొచ్చాడు. దుర్గాప్రసాద్ సహాయం కోసం కేకలు వేయడంతో, ఇద్దరు అక్కడి నుండి పారిపోయారు, తరువాత స్థానిక పోలీసులు అతన్ని రక్షించారు. బాలికకు మెసేజీ పెట్టాడనే ఆరోపణతో తనపై దాడి చేశారని దుర్గాప్రసాద్ పోలీసులకు తెలిపాడు. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.